బాన్సువాడ , బతుకమ్మ : హైదరాబాద్ – బోధన్ రహదారి విస్తరణలో భూములు కోల్పోతున్న తమకు ప్రస్తుత మార్కెట్ రేట్‌కు అనుగుణంగా పరిహారం చెల్లించాలని బాధితులు కోరారు. ఈ మేరకు సోమవారం బాన్సువాడలో సబ్ కలెక్టర్ కిరణ్మయికి వినతిపత్రం అందజేశారు. మహమ్మద్ నగర్ మండల కేంద్రంతోపాటు బూర్గుల్ గ్రామ శివారులో రహదారి విస్తరణ పనుల్లో భూములు కోల్పోతున్న తమకు ఎకరానికి రూ.30 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని కోరారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మాట్లాడుతూ.. హైవే అధికారులు, కలెక్టర్‌తో మాట్లాడుతానని హామీ ఇచ్చారు. వినతిపత్రం అందజేసిన వారిలో జక్సాని శ్రీనివాస్ గుప్తా, రాము, దుబ్బ నాగరాజు గుప్తా, ఎలగందుల ప్రవీణ్, చింతల సంతోష్, దుర్గ నరేశ్ తదితరులున్నారు.
