25.9 C
Hyderabad
Sunday, August 2, 2026

కేజీబీవీ ని సందర్శించిన కలెక్టర్

Must read

📰 Generate e-Paper Clip

  • విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని ఆదేశాలు

బతుకమ్మ భిక్కనూరు: జంగంపల్లి కేజీబీవీ ని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ శనివారం సందర్శించారు.
వసతి గృహాల్లో విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారాన్ని అందించాలని అధికారులను ఆదేశించారు. స్కూల్ పరిసర ప్రాంతాలలో చెత్తాచెదారం లేకుండా చూడాలని ఆయన ఆదేశించారు. విద్యార్థులకు నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య పౌష్టికాహారం అందించాలని, విద్యార్థులు త్రిబుల్ ఐటీల్లో సీట్లు సాధించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని అందుకు ఇప్పటినుంచే కార్యచరణ రూపొందించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో రంగనాథ్ భిక్కనూరు ఎమ్మార్వో శివ ప్రసాద్ ఎం పి ఓ రాజ్ కిరణ్ రెడ్డి, ఎంఈఓ రాజు గంగారెడ్డి, ఏఎస్ఐ జగదీష్ మదన్ లాల్ ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.

More articles

Latest article