24.7 C
Hyderabad
Monday, August 3, 2026

మైదుకూరులో రోడ్డు ప్రమాదం బాన్సువాడ వాసి మృతి

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ , బాన్సువాడ : కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణానికి చెందిన సయ్యద్ అహమదుల్లా శనివారం ఆంధ్రప్రదేశ్ లోని మైదుకూరు వద్ద రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. బాన్సువాడ పట్టణంలోని వీక్లీ మార్కెట్లో నివాసం ఉంటున్న సయ్యద్ అహ్మదుల్లా(39) బైకుపై వెళ్తూ రోడ్డుపై ఉన్న టిప్పర్ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు మైదుకూరు పోలీసులు తెలిపారు. కుటుంబ సభ్యులకు మైదుకూరు పోలీసులు సమాచారం అందించడంతో మైదుకూరుకు వెళ్లారు. అక్కడికి ఎందుకు వెళ్లారు అనే విషయం తెలియడం లేదు. అతని వద్ద గల ఎస్బిఐ బ్యాంక్ అకౌంట్ పాన్ కార్డు డ్రైవింగ్ లైసెన్స్ ఉండడంతో అక్కడి మైదుకూరు పోలీసులు గుర్తించి బాన్సువాడ పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. దీంతో వారు వెంటనే ఆంధ్రప్రదేశ్ లోని మైదుకూరు వెళ్లినట్లు తెలిపారు. అక్కడి నుంచి వచ్చి ఇక్కడ బాన్సువాడలో నివాసం ఉంటున్నట్లు తెలుస్తుంది. అక్కడ బంధువుల ఇంటికి వెళ్లి రోడ్డు ప్రమాదంలో మృతి చెందినట్లుగా భావిస్తున్నారు.

A Bansuwada resident died in a road accident in Maidukuru

More articles

Latest article