27.6 C
Hyderabad
Sunday, August 2, 2026

పోసానిపేట్ లో కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్

Must read

📰 Generate e-Paper Clip

రామారెడ్డి, బతుకమ్మ:

ధాన్యం కొనుగోలు కేంద్రాలలో తూకం పక్కాగా వేయాలని, ధాన్యంలో చెత్త లేకుండా  శుభ్రం చేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అదేశించారు. రామారెడ్డి మండలం పోసాని పేట్ గ్రామంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శనివారం కామారెడ్డి కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ధాన్యం ను శుభ్ర పరచాలని మానిటరింగ్ అధికారిని సూచించారు.  40 కిలోల 600 గ్రాముల ధాన్యం బస్తాలో నింపి పక్కాగా తూకం వేయాలని అన్నారు. కొనుగోలు కేంద్రంలో రైతులకు అన్ని ఏర్పాట్లు చేయాలని అన్నారు. వర్షాల వల్ల ధాన్యం తడిసి పోకుండా కొనుగోలు కేంద్రాల్లో టార్పాలిన్ సిద్ధంగా ఉంచుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా సహకార అధికారి రాం మోహన్, మానిటరింగ్ అధికారి యు. సాయిలు, తదితరులు పాల్గొన్నారు.

 

Collector inspecting the purchase center at Posanipet

More articles

Latest article