పోసానిపేట్ లో కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్

రామారెడ్డి, బతుకమ్మ: ధాన్యం కొనుగోలు కేంద్రాలలో తూకం పక్కాగా వేయాలని, ధాన్యంలో చెత్త లేకుండా  శుభ్రం చేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అదేశించారు. రామారెడ్డి మండలం పోసాని పేట్ గ్రామంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శనివారం కామారెడ్డి కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ధాన్యం ను శుభ్ర పరచాలని మానిటరింగ్ అధికారిని సూచించారు.  40 కిలోల 600 గ్రాముల ధాన్యం బస్తాలో నింపి పక్కాగా తూకం వేయాలని అన్నారు. కొనుగోలు కేంద్రంలో రైతులకు అన్ని ఏర్పాట్లు చేయాలని అన్నారు....