25.9 C
Hyderabad
Sunday, August 2, 2026

ప్రయాణికుల అభిప్రాయాల సేకరణ

Must read

📰 Generate e-Paper Clip

రుద్రూర్, బతుకమ్మ : బోధన్ డిపో మేనేజర్ విశ్వనాథ్ ఆదేశానుసారం  రుద్రూర్ బస్టాండ్ లో ఆర్టీసీ అధికారులు సోమవారం ప్రయాణికుల అభిప్రాయ సేకరణ కార్యక్రమం చేపట్టారు. ప్రభుత్వం నడిపే ఆర్టీసీ బస్సులు సమయానికి వస్తున్నాయా లేదా అని ప్రయాణికులను అడిగి తెలుసుకున్నారు. రోజు ప్రయానించే ప్రయాణికులే కాకుండా అప్పుడప్పుడు ప్రయానించే ప్రయాణికుల అభిప్రాయలతో పాటు సరిపడా బస్సులు ఉన్నాయా లేదా అని అడిగి, సరిపడా బస్సులు లేకపోతె బస్సుల సంఖ్యను పెంచే విధంగా సంస్థను కోరనున్నట్లు తెలిపారు. ప్రయాణికుల అభిప్రాయాలు సేకరించి వెనువెంటనే ఆన్ లైన్ లో అభిప్రాయాలను సేకరించారు. నేరుగా ప్రయాణికుల నుండే అభిప్రాయలను సేకరించి ఆన్ లైన్ లో పంపించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ డిపో క్లర్క్ శంకర్ , సాయ్యేందర్, కంట్రోలర్ మధుకర్ తదితరులు ఉన్నారు.

Collection of Travelers' Opinions

More articles

Latest article