డిల్లీ, బతుకమ్మ : సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క డిల్లీలో నర్రేంద మోదీతో బుధవారం భేటీ అయ్యారు. భారత్ ప్యూచర్ సిటీలో ఈనెల 8,9, తేదీల్లో నిర్వహించే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ కు ప్రధాని మోదీని ఆహ్వానించారు. ప్రధాని మోదీతో రేవంత్ కీలక చర్చలు జరిపారు. హైదరాబాద్ నుంచి బెంగళూరు, చెన్నైకు ’బుల్లెట్ రైలు‘ ప్రాజెక్టు మంజూరు చేయాలని కోరారు. అలాగే హైదరాబాద్ మెట్రో రెండో దశ విస్తరణకు వెంటనే అనుమతి ఇవ్వాలని కోరారు. ప్రతిష్టాత్మక రీజినల్ రింగ్ రోడ్ దక్షిణ భాగానికి అనుమతులతో పాటు నిధులు కేటాయించాలని మోదీకి విజ్ఞప్తిచేశారు. అంతకుముందు కేంద్ర మంత్రి అశ్వని వైష్ణవ్ తో వీరు భేటీ అయ్యారు. కేంద్ర మంత్రులతో పాటు లోక్ సభలో ప్రతిపక్షనేత రాహుల్ గాంధీని కూడా కలిసి సీఎం ఆహ్వానించనున్నారు.