. . . అరుదైన మైలు రాయి అందుకున్న నిమ్స్
హైదరాబాద్, బతుకమ్మ :
కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సల్లో అరుదైన మైలురాయిని అందుకున్న నిమ్స్ వైద్య బృందానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. హైదరాబాద్ నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) యూరాలజీ విభాగం 2 వేల కిడ్నీ మార్పిడులు పూర్తి చేసి దేశంలోనే అరుదైన రికార్డు నమోదు చేసింది. కిడ్నీ మార్పిడులలో దక్షిణ భారత దేశంలో నిమ్స్ మొదటి స్థానంలో నిలిచింది. దేశంలో కిడ్నీ ట్రాన్స్ ప్లాంట్లలో గుజరాత్‌లోని ఐకేడీఆర్‌సీ మొదటి స్థానంలో, లూధియానా క్రిస్టియన్ మెడికల్ కాలేజీ రెండో స్థానంలో ఉండగా, నిమ్స్ మూడో స్థానంలో ఉంది. ఈ అరుదైన మైలురాయిని సాధించి కిడ్నీ బాధితులకు విశేష సేవలు అందించిన నిమ్స్ వైద్య బృందానికి ముఖ్యమంత్రి అభినందనలు తెలిపారు. ఈ 2 వేల మందిలో 1,900 మంది అంటే 95 శాతం మంది రాజీవ్ ఆరోగ్యశ్రీ, ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఉచితంగా కిడ్నీ మార్పిడి చేయించుకోవడం విశేషం. 2023 జనవరి నుంచి గడిచిన మూడు సంవత్సరాల నాలుగు నెలల్లోనే 500 కిడ్నీ మార్పిడులు చేసి రికార్డు సృష్టించింది.
