29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

బంగారం చోరీ చేసిన గుర్తు తెలియని దుండగులు

Must read

📰 Generate e-Paper Clip

 

. . . చోరీ చేసిన దుండగులకై పోలీసుల గాలింపు చర్యలు

 

ఇందల్వాయి, బతుకమ్మ

 

ఇందల్ వాయి మండలంలో బంగారం, వెండి చోరీ అయిన ఘటన కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని తిర్మన్ పల్లి గ్రామానికి చెందిన బొడ్డు పెద్ద రాజన్న, తాటి పాముల శ్రీనివాస్ గౌడ్ అనే వ్యక్తులు వ్యవసాయం చేస్తు జీవిస్తుంటారు. శుక్రవారం వీరు ఇంట్లో లేని సమయంలో ఇంటి తలుపు గడియ కత్తిరించి తలుపులు తెరిచి ఇంట్లో కి ప్రవేశించిన దుండగులు బీరువాలు పగులగొట్టి దాంట్లో ఉన్న 7.5 తులాల బంగారం, 26 తులాల వెండి ఆభరణాలను దొంగలించారు. దీంతో బొడ్డు పెద్ద రాజన్న, తాటిపాముల శ్రీనివాస్ గౌడ్ ల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్టు పోలీసులు తెలిపారు.

 

Unidentified assailants stole gold

More articles

Latest article