27.3 C
Hyderabad
Friday, July 31, 2026

రాంబాన్ జిల్లాలో క్లౌడ్ బ్లరస్ట్

Must read

📰 Generate e-Paper Clip

వెబ్ న్యూస్, బతుకమ్మ : జమ్మూ కశ్మీర్ లోని రాంబాన్ జిల్లాలో క్లౌడ్ బ్లరస్ట్ సంభవించింది. ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా నలుగురు గల్లంతైనట్లు అధికారులు తెలిపారు. ఇళ్లలన్నీ జలమయమయ్యాయి. భారీ వర్షాల కారణంగా రియాసి జిల్లా మహోర్ లో  కొండ చరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది.  సహాయక బృందాలు  సంఘటన స్థలానికి చేరుకొని చర్యలు చేపడుతున్నాయి. గల్లంతయిన వారి ఆచూకీ కనుక్కునేందుకు స్థానిక అధికారులను బృందాలుగా పంపారు. జమ్మూ కశ్మీర్లో గత వారం రోజులుగా భారీ వర్షాలు కురుస్తుండడంతో నదులు పొంగి ప్రవహిస్తున్నాయి.  శ్రీనగర్ జాతీయ రహదారి సహా ప్రధాన మార్గాలు దెబ్బతినడంతో రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఉధంపూర్ జిల్లాలోని జఖేని- చేనాని మధ్య కొండ చరియలు విరిగిపడటంతో  ఇక్కడ 2,000 లకు పైగా వాహనాలు నిలిచిపోయాయి.

More articles

Latest article