- ఓ యువకుని పై పలువురు వ్యక్తులు దాడి
- పోలీస్ స్టేషన్ వరకు వెళ్లిన పంచాయితీ
రుద్రూర్, బతుకమ్మ : రుద్రూర్ మండల కేంద్రంలోని డబుల్ బెడ్ రూమ్ (జవహర్ నగర్) కాలనీ వద్ద ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగిందని, ఈ ఘర్షణ పోలీస్ స్టేషన్ వరకు వెళ్లగా, కేసులు నమోదు అయినట్టు విమర్శలు వినిపిస్తున్నాయి. ఇతర రాష్ట్రంలో గ్రామం నుంచి అదే విధంగా, ఇతర గ్రామము నుంచి ఇరువురు యువకులు పని కోసం వెళ్ళగా ఒక యువకుడు తన సొంత గ్రామమైన రుద్రూర్ కు రావడం జరిగింది. డబ్బులు ఇచ్చే విషయంలో ఇతర గ్రామాల నుంచి ఇతని ఆచూకీ కోసం ఫోటో తీసుకొని రాగా, ఎస్సీ కాలనీలో కొంతమంది యువకులు చూపించడం జరిగిందని, ఈ విషయంలో మొదటగా మామూలుగా వివాదం జరుగగా, పోలీసులు రంగ ప్రవేశం కావడంతో పరిస్థితి సద్దుమణిగిందని, మళ్లీ కొద్ది సేపటి తర్వాత ఇరువర్గాలు ఈ విషయంలో ఘర్షణ పడడం జరిగిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దళిత కాలనీకి చెందిన కొంతమంది యువకులు తమపై కులం పేరుతో దూషించి అతి కిరాతకంగా కొంతమంది దాడి చేశారంటూ ఆరోపణ చేస్తూ, రుద్రూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగిందని, ఈ విషయంలో కేసులు నమోదు అయినట్టు సమాచారం. ఇంకొక వర్గం వారు కూడా ఫిర్యాదులు చేసినట్టు సమాచారం. ఇంకొక వర్గానికి చెందిన వారు తాము కులం పేరుతో దూషించలేదని ఎవరిపై దాడులు చేయలేదని, ఘర్షణ జరుగుతుంటే ఆపడానికి వెళ్దామని, దళిత కులం పేరుతో దూషించినప్పుడు, ఎస్సీ అట్రాసిటీ పేరుపై ఫిర్యాదు ఇవ్వడం ఏమిటని పలువురు విమర్శలు చేస్తున్నారు. ఈ విషయమై ఎస్ఐ ని చరవాణి ద్వారా వివరణ కోరగా ఈ ఫిర్యాదు విషయం డిఎస్పి లెవెల్ లో ఉందని సమాధానమిచ్చారు.
