బతుకమ్మ, జుక్కల్: అంగన్వాడీ యూనియన్, అల్ ఇండియా పెడరేషన్ ఏర్పడిన రోజు పురస్కరించుకొని సోమవారం బిచ్కుంద మండల కేంద్రం లొని అంబేద్కర్ చౌరస్తా వద్ద సి ఐ టి యు జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా అంగన్వాడీ యూనియన్ ప్రాజెక్ట్ కార్యదర్శి ఆర్. అనసూయ, నర్సవ్వ ల చేతుల మీదుగా జెండా నుఆవిష్కరించారు.కార్యక్రమం లో అంగన్వాడీ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షుడు సురేష్ అన్న ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జెండా ఆవిష్కరణ సందర్బంగా సురేష్ మాట్లాడుతు కేంద్ర ప్రభుత్వం అంగన్వాడీ టీచర్స్, హెల్పర్లకు దేశ వ్యాప్తంగా సుప్రీం కోర్ట్ తీర్పు ప్రకారం గ్రాటివిటీ చెల్లించాలని డిమాండ్ చేశారు. గుజరాత్ హై కోర్ట్ తీర్పు ప్రకారం అంగన్వాడీ టీచర్లను మూడో తరగతి, హెల్పర్లను నాలుగవ తరగతి ఉద్యోగులుగా గుర్తించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ లకు ఎన్నికల సమయం లో మేనిపెస్టో లో ఇచ్చిన హామీలను అమలు చెయ్యాలని శాశ్వత వేతనం 26వేలు ఇస్తామని హామీ ఇచ్చి సంవత్సరం పూర్తయిన నేటికీ దాని ఊసే ఎత్తడం లేదని ప్రభుత్వ తిరుపై ఆయన మండి పడ్డారు. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి ఖాళీ ఏర్పడ్డ పోస్టులను వెంటనే భర్తీ చెయ్యాలని, అంగన్వాడీ లకు స్వంత భవనలు లేని వాటికి వెంటనే నిధులు కేటాయించి నూతన అంగన్వాడీ భవనలు నిర్మించాలని అన్నారు. శిథిలావస్థకు చేరిన అంగన్వాడీ కేంద్రాలను వెంటనే మరమ్మత్తు లు చేయించాలని అన్నారు. మిని అంగన్వాడీ కేంద్రా లను మెయిన్ కేంద్రాలుగా గుర్తించనప్పటికి నేటికి వారికి మిని వేతనాలే ఇస్తున్నారని తక్షణమే పెండింగ్ లో ఉన్న వేతనాలు మంజూరు చెయ్యాలని, సీనియారిటి ప్రకారం అరులైన హెల్పర్లను ప్రమోషన్ లు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమం లో ఆర్. అనసూయ, శారద, లక్ష్మి, రుక్మిణి, నర్సవ్వ, శ్వేత, శాంత, అనిత, సునీత,గోవింద్, ఆడేప్ప, సాయిలు, రూపుసింగ్, భూమయ్య, సాయన్న, లింగురం లు పాల్గొనగ అంబేద్కర్ యువజన సంఘం జుక్కల్ నియోజకవర్గ నాయకుడు పరశురామ్ పాల్గొని కార్మికులకు మద్దత్తు తెలిపారు.

