29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

చెక్ డ్యామ్ సందర్శించిన సీఐ, ఎమ్మార్వో, ఎస్సై, ఆర్ ఐ

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ,మోర్తాడ్: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల ఎగువ ప్రాంతంలో నుంచి వస్తున్న వరద ప్రవాహం వల్ల ధర్మోరా గ్రామ శివారులో పెద్ద వాగు పైన నిర్మించిన చెక్ డ్యామ్ పొంగిపొర్లుతుండడంతో రాకపోకలు నిలిపివేశారు. ఆదివారం మధ్యాహ్నం భీమ్ గల్ సిఐ నవీన్, ఎమ్మార్వో సత్యనారాయణ, ఎస్సై విక్రమ్, ఆర్ఐ రంజిత్ తదితరులు ధర్మోరా, పాలెం మధ్య ఉన్న చెక్ డ్యామ్ ను సందర్శించారు. ఈ దారి గుండ వాహనాలు రావద్దని రాకుండా చర్యలు తీసుకోవాలని గ్రామ అధికారులకు తెలిపారు. అధికారుల వెంట పంచాయితీ కార్యదర్శి అరుణ్ ,కారోబర్ సాయన్న తదితరులు ఉన్నారు.

More articles

Latest article