28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన సీఐ, ఎఫ్ ఆర్వో

Must read

📰 Generate e-Paper Clip

వెబ్ న్యూస్, బతుకమ్మ : నారాయణపేట జిల్లా మక్తల్ పోలీస్ స్టేషన్ లో లంచం తీసుకుంటూ సీఐ, ఇద్దరు కానిస్టేబుళ్లు ఏసీబీకి చిక్కారు. ఓ కేసులో రూ.20 వేలు లంచం తీసుకుంటుండగా మక్తల్ సీఐ చంద్రశేఖర్, కానిస్టేబుళ్లు శివారెడ్డి, నరసింహాను ఏసీబీ అధికారులు రెడ్ హ్యండెడ్ గా పట్టుకున్నారు.

భద్రాద్రి జిల్లాలో మరో ఘటనలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్, బీట్ ఆఫీసర్లు ఏసీబీకి చిక్కారు. అటవీ భూమి నుంచి మట్టి తవ్వుకునేందుకు రైతు వద్ద రూ.30 వేలు లంచంగా సిబ్బంది అడిగారు. సమాచారం  అందుకున్న ఏసీబీ అధికారులు ఇల్లెందు మండల కొమరారం ఫారెస్ట్ రేంజ్ ఆఫీసులో దాడులు నిర్వహించారు.  

More articles

Latest article