. . . మెడికల్ బోర్డు కన్వీనర్ డాక్టర్ దయానంద్
డిచ్ పల్లి, బతుకమ్మ :
గత కొన్ని నెలలుగా వివాదాలను ఎదుర్కొంటున్న డిచ్ పల్లి లోని క్రిస్టియన్ మెడికల్ హాస్పిటల్ త్వరలోనే మనుగడలోకి వస్తుందని మెడికల్ బోర్డు కన్వీనర్ దయానంద్ వెల్లడించారు. షణ్ముక లింగం అనే వ్యక్తి పెద్ద చీటర్ అని అతను మాటలు నమ్మవద్దని దయానంద్ కోరారు. ఈ మేరకు మంగళవారం డిచ్ పల్లి క్రిస్టియన్ మెడికల్ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో క్రిస్టియన్ మెడికల్ కళాశాల ట్రస్ట్ సభ్యులు మాట్లాడారు. సుదీర్ఘ చరిత్ర కలిగిన సిఎంసి ఆసుపత్రి ని షణ్ముఖ లింగం అనే వ్యక్తి తప్పుడు ఐఏఎస్ గా ప్రచారం చేసుకుంటూ సిఎంసి ఆస్పత్రి ఎంఓయూ ఇచ్చినట్లు ప్రచారం చేసుకుంటూ రూ.2.2 కోట్లు అక్రమంగా వసూలు చేయడం జరిగిందన్నారు. అతనిపై డిచ్ పల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు పూర్తిస్థాయిలో విచారణ జరిపి ఈ నెల 11 న ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగిందన్నారు. ఆస్పత్రి పై తప్పుడు ప్రచారాలతో అబాసు పాలు చేస్తున్న షణ్ముఖ లింగంకు ఎవరు సహకరించిన వారిపై న్యాయపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ట్రస్ట్ సభ్యులు హెచ్చరించారు. ఇక నుండి సీఎంసీ ఆసుపత్రిని తామే నడుపుతామని నర్సింగ్ కోర్సుల కోసం దరఖాస్తు చేసుకోవడం జరిగిందని త్వరలోనే అనుమతులు వస్తాయని సభ్యులు ధీమా వ్యక్తం చేశారు.
