27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

నిర్దిష్టమైన లక్ష్యాన్ని ఎంచుకుని కష్టపడి చదవాలి

Must read

📰 Generate e-Paper Clip

జిల్లా జడ్జీ సునీత కుంచాల

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : విద్యర్థినిలు ఒక నిర్దష్టమైన లక్ష్యాన్ని ఎంచుకుని కష్టపడి  చదివి ఆ  లక్ష్యాన్ని ఎంచుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల సూచించారు. నగరంలో బుధవారం ఏర్పటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. వ్యక్తి  గత సమస్యలను స్నేహితులతో చర్చించుకోవాలని అన్నారు. నేటి ఆడపిల్లలకు ఆత్మ రక్షణ చాలా  ముఖ్యమని అన్నారు. అందుకోసం శిక్షణ తీసుకుని తననుతాను కాపాడుకోవాలని తెలిపారు. ఆడపిల్లలకు ఏదైనా  సమస్యల ఉంటే 1098కు ఫోన్ చేయాలని తెలిపారు. 18 సంవత్సరాలు నిండని వారు వాహనాలు నడిపిస్తే చట్టరీత్యా శిక్షార్హులని అన్నారు. పరీక్షలో నెగ్గకపోతే నిరాశ పడుకుండా మళ్ళీ మళ్ళీ ప్రయత్నించాలని విజయం తప్పకుండా వరిస్తుందని ఆకాంక్షించారు.

Choose a specific target and study hard

More articles

Latest article