30.2 C
Hyderabad
Sunday, August 2, 2026

ఖమ్మం వరద బాధితులకు చిన్నారుల చేయూత.

Must read

📰 Generate e-Paper Clip

– కలెక్టర్ కు 16 వేలు అందజేసిన ఇమేజ్ విద్యార్థులు
– అభినందించిన పలువురు.

 నవీపేట్, బతుకమ్మ :

చిన్నారుల చిట్టి చేతులతో ఖమ్మం వరద బాధితులకు పెద్ద సహాయం చేశారు. మహాత్మా గాంధీ జయంతి ని పురస్కరించుకొని ఎడపల్లి మండలం జాన్కంపేట్ గ్రామంలోని ఇమేజ్ పబ్లిక్ స్కూల్ ఆధ్వర్యంలో వరదభాధితుల సహాయార్థం సీఎం రిలీఫ్ ఫండ్ కు జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా 16 వేల 116 రూపాయల చెక్కును అందజేశారు.
గాంధీ జయంతి సందర్భంగా నిర్వహించిన ఒక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు కు పాఠశాల మేనేజ్మెంట్, ఉపాధ్యాయులు, విద్యార్థులు కలిసి బుధవారం నాడు చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా గాంధీ వేషధారణలో ఉన్న విద్యార్థులను జిల్లా కలెక్టర్ అభినందించారు. పాఠశాల హెడ్మాస్టర్ శైలజ మాట్లాడుతూ… ప్రతీ సంవత్సరం తమ పాఠశాల ఆధ్వర్యంలో గాంధీ జయంతి రోజున అనాథ ఆశ్రమాలకు, వృద్ధాశ్రమాలకు నగదు రూపేణా, వస్తు రూపేణా విరాళాలు అందజేయడం జరుగుతుందన్నారు. ఈ సంవత్సరం ఖమ్మం జిల్లాలో వరదలవల్ల నష్టపోయిన వరదబాధితుల సహయార్థం విరాళాలు అందజేశామన్నారు. గత 15 సంవత్సరాలుగా ఇలాంటి కార్యక్రమాలు తమ పాఠశాల ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో స్కూల్ కరెస్పాండెంట్ నాగరాజు, ఉపాధ్యాయులు మమత, విద్యార్థులు పాల్గొన్నారు.

More articles

Latest article