బతుకమ్మ, బోధన్: బోధన్ : రెవెన్యూ సదస్సుల్లో అందిన సదబీనామా దరఖాస్తులపై చర్యల నిర్వహణను పరిశీలించేందుకు బోధన్ సబ్ కలెక్టర్ వికస్ మాతో కోటగిరి, ఎడపల్లి మండల తహసీల్దార్ కార్యాలయాలను సందర్శించారు. ఈ సందర్భంగా సంబంధిత తహసీల్దార్‌లతో ఫైళ్లపై సమగ్ర సమీక్ష నిర్వహించిన సబ్ కలెక్టర్ , అంగీకరించబడిన, తిరస్కరించబడిన దరఖాస్తులన్నింటికీ సంబంధించిన ఫైళ్లను సిద్ధం చేసి, తహసీల్దార్ లాగిన్ నుంచి సబ్ కలెక్టర్ లాగిన్‌కు త్వరితంగా పంపించాలని ఆదేశించారు. రెవెన్యూ విభాగం పనితీరు మరింత వేగవంతం చేసి, ప్రజల సమస్యలను పరిష్కారం చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.

