నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నిజామాబాద్ ఏసీపీ ఆదేశాల మేరకు నగరంలోని రైల్వే స్టేషన్ లో గురువారం తనిఖీలు నిర్వహించినట్లు ఒకటో టౌన్ ఎస్ఎచ్ఓ రఘుపతి తెలిపారు. రైల్వే స్టేషన్ ఆవరణలో అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తుల బ్యాగులను తనిఖీ చేసినట్లు తెలిపారు. ఎవరైనా అనుమాస్పదంగా తిరుగుతున్న, గంజాయి అమ్ముతున్న డయల్ 100 నెంబర్ కాల్ చేసి చెప్పాలని సూచించారు. ఈ తనిఖీల్లో నలుగురు ఎస్ఐ లు, 25 మంది పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

