29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

పాలెం పాఠశాల తనిఖీ

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, మోర్తాడ్:  మోర్తాడ్ మండలంలోని పాలెం లో గల జెడ్ పి హెచ్ ఎస్ పాఠశాలను నోడల్ ఆఫీసర్ సమ్మిరెడ్డి తనిఖి చేశారు. ఇందులో భాగంగా ప్రతి తరగతి లోకి వెళ్లి పిల్లల సామర్థ్యాలను అలాగే విద్యార్థులు రాసినటువంటి పరీక్షాల గురించి బేస్ లైన్ టెస్ట్, ఎల్ఐపి(లెర్నింగ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రాం) , ఎఫ్ఏ వన్ పరీక్షల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం మధ్యాహ్న భోజనం ఎలా ఉందో పరిశీలించారు. తర్వాత ఉపాధ్యాయులతో సమావేశం జరిపి ప్రతి ఒక్కరు డైరీ రాయాలని, లెసన్ ప్లాన్ రాయాలని, యూనిట్ ప్లాన్, రాసుకోవాలని తెలియజేశారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు పి.వేణుగోపాలరావు, ఉపాధ్యాయులు మహేష్ కుమార్, చంద్రశేఖర్, నరసింహస్వామి, రాజేందర్, జయశ్రీ, త్రివేణి, రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article