పాలెం పాఠశాల తనిఖీ
బతుకమ్మ, మోర్తాడ్: మోర్తాడ్ మండలంలోని పాలెం లో గల జెడ్ పి హెచ్ ఎస్ పాఠశాలను నోడల్ ఆఫీసర్ సమ్మిరెడ్డి తనిఖి చేశారు. ఇందులో భాగంగా ప్రతి తరగతి లోకి వెళ్లి పిల్లల సామర్థ్యాలను అలాగే విద్యార్థులు రాసినటువంటి పరీక్షాల గురించి బేస్ లైన్ టెస్ట్, ఎల్ఐపి(లెర్నింగ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రాం) , ఎఫ్ఏ వన్ పరీక్షల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం మధ్యాహ్న భోజనం ఎలా ఉందో పరిశీలించారు. తర్వాత ఉపాధ్యాయులతో సమావేశం జరిపి ప్రతి ఒక్కరు డైరీ రాయాలని, లెసన్ ప్లాన్ రాయాలని,...