28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

బీసీ బాలుర హాస్టల్ తనిఖీ 

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ,భీమ్ గల్: భీమ్ గల్ మండల కేంద్రంలో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు పట్టణంలోని బీసీ బాలుర హాస్టల్లో మంగళవారం మున్సిపల్ కమిషనర్ వై. రామకృష్ణ తనిఖీ చేయడం జరిగింది. హాస్టల్ లోని స్టోర్ రూమ్ ని, వంటగదిని పరిశీలించడం జరిగింది.పరిశుభ్రత పాటించాలని సిబ్బందికి సూచించారు. పిల్లలు తినే ఆహారాన్ని నాణ్యతతో అందించాలన్నారు. పప్పులు. కూరగాయలు. బియ్యము. ఇతర సరుకులు ఉండే రూములను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. వంటగదిని ఎప్పటికప్పుడు శుభ్రం ఉంచుకోవాలన్నారు. వంట పాత్రలను శుభ్రంగా ఉంచుకోవాలన్నారు. హాస్టల్ సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో వార్డ్ ఆఫీసర్ కె.నవీన్ ఇంచార్జ్ సానిటరీ ఇన్స్పెక్టర్ సున్నపు ఓంకార్. జవాన్ రాజయ్య. హాస్టల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article