27.6 C
Hyderabad
Sunday, August 2, 2026

నిజామాబాద్ అదనపు డిసీపిగా బస్వారెడ్డి

Must read

📰 Generate e-Paper Clip

 నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :  నిజామాబాద్ అదనపు కమీషనర్ ఆఫ్ పోలీస్ గా గట్టు బస్వారెడ్డి నియమితులు అయ్యారు. నిజామాబాద్ అడిషనల్ డిసిపి( అడ్మిన్ ) గా ఉన్న కోటేశ్వర రావును ఎల్ బినగర్ లా అండ్ అర్డర్ డిసీపీగా బదిలీ చేస్తు ఉత్తర్వులు జారీ అయ్యాయి. రాష్ట్రంలో ముగ్గురు ఎస్పీలు, 30 మంది అదనపు ఎస్పీలను బదిలీ చేస్తు మంగళవారం  ఉత్తర్వులు జారీ అయ్యాయి. అందులో భాగంగా నిజామాబాద్ డిసిపీ( అడ్మిన్ ) బదిలీ కాగా నిజామాబాద్ జిల్లాలో అదనపు డిసీపీ లా అండ్ అర్డర్ గా పని చేస్తున్న బస్వారెడ్డిని అడ్మిన్ గా నియమించారు. నిజామాబాద్ శాంతి భధ్రతల డిసీపీగా ఎవరిని నియమించలేదు. నిజామాబాద్ జిల్లాలో పోలీస్ కమీషనర్ పోస్టు ఖాళీగా ఉండటంతో కామారెడ్డి ఎస్పీ సిందూశర్మ ఇంచార్జీ సిపీగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.

More articles

Latest article