భీంగల్, బతుకమ్మ : శ్రీమహా విష్ణువు యోగానిద్రలోకి వెళ్ళే సుదినం శయన ఏకాదశిని పురస్కరించుకొని నేటి నుండి చాతుర్మస్య వ్రతం ప్రారంభం కానుంది. శయన ఏకాదశిన విష్ణువు యోగ నిద్రలోకి వెళ్లి కార్తీక మాసంలో ఉత్తన ఏకాదశి రోజున తిరిగి బయటి వస్తారు. ఈ ఆషాడం నుండి కార్తీక మాసం వరకు విష్ణువు యోగ నిద్రలో ఉన్న నాలుగు నెలల కాలాన్ని చతుర్మాసం అని అంటారు. ఈ చతుర్మాసంలో హిందువులు చేసే వ్రతమే చాతుర్మాస వ్రతం అంటారు. ఈ వ్రత కాలంలో భగవంతునికి టెంకాయ, పండ్లు, కూరగాయల నైవేద్యం పనికి రాదని నింబచల అర్చకులు నంబి పార్థసారథి, నంబి వాసుదేవాచార్యులు చెబుతున్నారు.ఈ చతుర్మస వ్రత సమయంలో భగవంతునికి బెల్లం, కడిషర్కర ను నైవేద్యంగా పెట్టాలని వారు భక్తులకు సూచిస్తున్నారు. ముఖ్యంగా లింబాద్రి గుట్ట పై ఈ వ్రత కాలంతం వరకు టెంకాయ, పండ్లు, కూరగాయల నై వేధ్యాలను అనుమతించబడదని భక్తులకు తెలియజేస్తున్నారు. ఈ విషయాన్నీ భక్తులు గమనించి ఆలయ వద్ద అర్చకులకు సహకరించాలని వారు కోరుతున్నారు.
