29.4 C
Hyderabad
Sunday, August 2, 2026

చంద్రశేఖర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక విధానాలకు పాల్పడ్డాడు

Must read

📰 Generate e-Paper Clip

 

రుద్రూర్, బతుకమ్మ :

 

బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు చంద్రశేఖర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక విధానాలను పాల్పడ్డారని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు తోట అరుణ్ కుమార్ అన్నారు. రుద్రూర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గురువారం విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆయనతో పాటు దిశా కమిటీ మెంబర్ నడిపింటి నగేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ బాన్సువాడ లో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు చంద్రశేఖర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేయడం సరికాదన్నారు. దీనిని కాంగ్రెస్ పార్టీ నాయకులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని అన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు అక్కపల్లి నాగేందర్, తోట సంగయ్య, నేరుగంటి బాలరాజ్, వార్డు మెంబర్ ఇమ్రాన్, కొండల్వాడి శంకర్, షేక్ ఖాదర్, సంతోష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

More articles

Latest article