• స్కూల్ అసిస్టెంట్,హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గా ఎంపిక
కోటగిరి, బతుకమ్మ : సోమవారం విడుదలైన డిఎస్సీ ఫలితాల్లో నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం సుద్దులం తాండాకు చెందిన దేవసొత్ చందర్ రాథోడ్ అత్యుత్తమ ప్రతిభతో మెరిశాడు. సాంఘిక శాస్త్రం విభాగంలో జిల్లాస్థాయిలో 37, ఎస్టీ కేటగిరిలో మొదటి ర్యాంకు సంపాదించి ఔరా అనిపించారు. అటు మరోపక్క ఇటీవల విడుదలైన హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఫలితాల్లో జోనల్ స్థాయిలో 1519, కేటగిరి లో 6వ ర్యాంకు సాధించాడు. ఒకేసారి రెండు ఉద్యోగాలకు ఎంపిక కావడం పట్ల ఆయన్ను పలువురు అభినందించారు. కాగా చందర్ రాథోడ్ తెలంగాణ విశ్వవిద్యాలయం లో ఎల్ఎల్బి ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు.ఈ క్రమంలోనే వెలువడిన ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభతో మెరిశాడు.
పంచాయతీ కార్యదర్శిగా పనిచేసి… ఇప్పుడు టీచర్ గా
2018లో పంచాయతీ కార్యదర్శి ఫలితాల్లో ఉద్యోగం సంపాదించి దాదాపుగా రెండేళ్ల పాటు రుద్రూర్ మండలం రాయకూర్ గ్రామ పంచాయతీకి కార్యదర్శిగా పనిచేశారు. అనంతరం డిఎస్సీ పరీక్షల నిమిత్తం పంచాయతీ కార్యదర్శి ఉద్యోగాన్ని పక్కన పెట్టి కష్టపడి సన్నద్ధం అయ్యి స్కూల్ అసిస్టెంట్ గా ఎంపికయ్యారు.
