25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

ఛలో గోవా పోస్టర్ ఆవిష్కరణ

Must read

📰 Generate e-Paper Clip

 బతుకమ్మ, బోధన్ : నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో, రాజకీయాలకు అతీతంగా బీసీలంతా ఏకం కావాలన్న ఉద్దేశంతో ఆగస్టు 7వ తేదీన గోవా లో నిర్వహించబోయే ఓబీసీ 10వ జాతీయ మహాసభలను విజయవంతం చేయాలని బోధన్ నియోజకవర్గ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు గాండ్ల రవీందర్ యాదవ్ గారు పిలుపునిచ్చారు. ఈ సందర్బంగా బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు సిరివెసు సంతోష్ తో కలిసి “చలో గోవా” పోస్టర్‌ను ఆవిష్కరించారు. మహాసభలకు బోధన్ నియోజకవర్గం నుండి పెద్ద సంఖ్యలో బీసీ సంఘం నాయకులు, విద్యార్థులు, యువత పాల్గొనాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు రవిశంకర్ గౌడ్, జక్కా సంజీవ్ పటేల్, కార్తీక్, సత్యనారాయణ, శివ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article