25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

కెనరా బ్యాంక్ గ్రామస్థాయి జన సురక్ష కార్యక్రమం

Must read

📰 Generate e-Paper Clip

మాక్లూర్, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలంలోని చిక్లి గ్రామంలో కెనరా బ్యాంక్ గ్రామ స్థాయిలో జన సురక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హైదరాబాద్ సర్కిల్ ఆఫీస్ జిఎం కళ్యాణ్ ముఖర్జీ, కెనరా బ్యాంక్ నిజామాబాద్ ఆర్ఎం వినోద్ బాబు గ్రామస్థాయి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కళ్యాణ్ ముఖర్జీ మాట్లాడుతూ 1906 కెనరా బ్యాంకు ను అంబేమ్ బాల్ సుబ్బారావు కర్ణాటకలో స్థాపించారని ప్రభుత్వ రంగ సంస్థల్లో మూడవ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకుకు అభివృద్ధి చెందిందని వారు గుర్తు చేశారు. ప్రభుత్వ ప్రజలకు అతి చేరువలో అన్ని రకాల సదుపాయాలను కెనరా బ్యాంక్ అందిస్తుందని రుణాల విషయంలో వ్యవసాయ రుణాలు ఇంటి నిర్మాణం క్రాప్ లోన్ ట్రాక్టర్ లోన్ ఎడ్యుకేషన్ లోన్ డైరీ ఫార్మ్ లోన్, మహిళల కోసం ఎస్సైజి లోన్స్ వంటి అనేక లోన్లను కెనరా బ్యాంక్ అతి సులభంగా అందిస్తుందని వారు వివరించారు. ప్రత్యేకంగా మహిళల కోసం మరిన్ని లోన్లను కెనరా బ్యాంకు ద్వారా అందించడం జరుగుతుందని వారన్నారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాల్లో భాగంగా చిక్లి గ్రామంలో గ్రామస్థాయి జన సురక్షణ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది  ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వ పథకాలైన పీఎంజేవై, పీఎం సురక్ష , అటల్ పింఛన్ యోజన వంటి అనేక కేంద్ర పథకాలను కెనరా బ్యాంక్ ద్వారా ప్రజల అందిస్తున్నామని తెలిపారు. ప్రతి ఒక్కరూ కేంద్ర కేంద్ర ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు ‌ కేంద్ర ప్రభుత్వం పథకాల గురించి వారు వివరించారు. అలాగే కెనరా బ్యాంక్ తరఫున గ్రామ అభివృద్ధి కోసం పది లక్షల విరాళాన్ని అందించడం జరుగుతుందని వారు గుర్తు చేశారు. అనంతరం  గ్రామ అభివృద్ధి కమిటీ జిఎం కళ్యాణ్ ముఖర్జీ ఆర్ఎం వినోద్ జన్నపల్లి శాఖ కెనరా బ్యాంక్ మేనేజర్ మధు గారిని పూలమాలతో సత్కరించి కెనరా బ్యాంకు వారికి గ్రామస్తులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాంగ్రా బ్యాంక్ మేనేజర్ శివ ప్రసాద్, జన్నపల్లి శాఖ బ్యాంక్ మేనేజర్ మధు, బ్యాంక్ సిబ్బంది గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు సంజీవ్,సాయిలు, గ్రామస్తులు గైన్ రాజన్న, గంగాధర్,షబ్బీర్,సతీష్,నవిన్, మహేష్, కెనరా బ్యాంక్ బిసి నవీన్ మల్లేష్ గ్రామస్తులు పాల్గొన్నారు.

More articles

Latest article