29.6 C
Hyderabad
Sunday, August 2, 2026

బీసీల హక్కుల సాధనకై ఛలో ఢిల్లీ

Must read

📰 Generate e-Paper Clip

  • ఛలో ఢిల్లీ పోస్టర్ కరపత్రాలను ఆవిష్కరించిన జిల్లా బీసీ సంక్షేమ సంఘం నాయకులు

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఏప్రిల్ 2వ తేదీన తలపెట్టిన చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి అని నిజామాబాద్ బీసీ సంక్షేమ సంఘం జిల్లా నాయకులు పిలుపునిచ్చారు. బీసీల హక్కుల సాధనకై బీసీల పోరు గర్జనకు పిలుపునిచ్చిన జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ మేమెంతో మాకు అంత వాటా అనే నినాదంతో ఏప్రిల్ 2న ఢిల్లీలో బీసీల పోరు గర్జన నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా కులగనన చేపట్టాలని అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్లు 42 శాతం కు పెంచుతూ అసెంబ్లీలో చేసిన చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఈ పార్లమెంటు సమావేశాలలోని ప్రవేశపెట్టి రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. నిజామాబాద్ జిల్లా నుండి పెద్ద ఎత్తున బీసీలు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం పోస్టర్లను నగరంలోని కేర్ డిగ్రీ కళాశాలలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్, బుస ఆంజనేయులు, పోల్కం గంగాకిషన్, కరిపె రవీందర్,  దర్శనం దేవేందర్, కొయ్యడ శంకర్, శ్రీలత, చంద్రమోహన్, చంద్రకాంత్, దారం భూమన్న, బాలన్న, అజయ్, వాసం జయ, లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article