26.3 C
Hyderabad
Monday, August 3, 2026

బోధన్ పట్టణ సమస్యలపై పట్టించుకోని చైర్ పర్సన్ అధికారులు

Must read

📰 Generate e-Paper Clip

 – బిఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు రవీందర్ యాదవ్

బతుకమ్మ బోధన్ : బోధన్ పట్టణంలో రోజురోజు కి పెరుగుతున్న కుక్కల బెడద, రోడ్ల పై గుంతలు లాంటి సమస్యలపై మున్సిపల్ చైర్ పర్సన్, మున్సిపాలిటీ అధికారులు పట్టించుకోవడం లేదని బిఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు రవీందర్ యదవ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. బోధన్ పట్టణంలో శనివారం బిఆర్ఎస్ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రవీందర్ యదవ్ మాట్లాడుతూ బోధన్ పట్టణంలో రోజురోజుకూ కుక్కల బెడద పెరిగిందని, కొన్ని రోజులుగా ప్రజలను కరుస్తూ గాయాలు చేస్తున్న మున్సిపల్ ఛైర్పర్సన్ పట్టించుకున్న పాపాన పోలేదని అన్నారు. వర్షాకాలం వచ్చిన నాటినుండి రోడ్లపై గుంతలు పడి ప్రజలు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్న మున్సిపాలిటి అధికారులు,సిబ్బంది పట్టించుకోక పోవడం దారుణమని అన్నారు. బోధన్ ఎమ్మెల్యే మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి బోధన్ అభివృద్ధి, సమస్యల పై రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేసి సమస్యలపై దృష్టి సారించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బెంజార్ గంగారాం, కౌన్సిలర్ సత్యం, బిఆర్ఎస్ నాయకులు మహమ్మద్ రజాక్, రవి శంకర్ గౌడ్, ప్రవీణ్ నాయక్, అహ్మద్, సాగర్, షేక్ జాకీర్, తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article