29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

భారత్, పాక్ మధ్య కాల్పుల విరమణ

Must read

📰 Generate e-Paper Clip

  • విదేశాంగ శాఖ ప్రతినిధి విక్రమ్ మిస్రీ

 

ఢిల్లీ, బతుకమ్మ : భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ఇరు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయని భారత విదేశాంగ శాఖ ప్రతినిధి విక్రమ్ మిస్రీ తెలిపారు. ఈ కాల్పుల విరమణ శనివారం సాయంత్రం 5గంటల నుంచి అమల్లోకి వస్తుందని తెలిపారు. అంతకు ముందు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ట్రూత్ సోషల్ మీడియా వేదికగా అమెరికా మధ్య వర్తిత్వంలో భారత్, పాకిస్తాన్ ఇరు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయని పోస్ట్ చేశారు. అమెరికా మధ్యవర్తిత్వంలో రాత్రంగా సుధీర్ఘంగా చర్చలు జరిగాయన్నారు. ఇరు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయన్నారు. సరైన సమయంలో ఇరు దేశాలు తెలివిగా వ్యవహరించాయని అన్నారు.

More articles

Latest article