27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

పేకాట స్థావరం పై సీసీఎస్ టీం దాడి

Must read

📰 Generate e-Paper Clip

 

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :

 

నగరంలోని 6వ టౌన్ పరిధిలో పేకాట స్థావరంపై సీసీఎస్ పోలీసులు దాడులు నిర్వహించారు. శుక్రవారం నిజామాబాద్ పోలీస్ కమీషనర్ పి.సాయి చైతన్య ఆదేశాల మేరకు సీసీఎస్ ఏసీపీ మస్తాన్ అలీ ఆధ్వర్యంలో సీసీఎస్ సిబ్బంది 6వ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సారంగాపూర్, మిషన్ భగీరథ లో పేకాట స్థావరం పై రైడ్ చేశారు. ఈ దాడిలో ఐదుగురు పేకాట రాయుళ్ళను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి 4 సెల్ ఫోన్ లను, 4 బైక్ లను, ఆటో ను, రూ.11,170 నగదును స్వాధీనం చేసుకున్నారు. తదుపరి చర్య నిమిత్తం 6వ టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్ హెచ్ వో కి అప్పగించారు.

More articles

Latest article