27.6 C
Hyderabad
Sunday, August 2, 2026

ముస్లింల కోసమే కులగణన : రాజ్యసభ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్

Must read

📰 Generate e-Paper Clip

రేవంత్ రెడ్డిది టైం పాస్ పాలన

బీ ఆర్ ఎస్ పార్టీకి నూకలు చెల్లాయి

ఉద్యోగాలు ఇవ్వని కాంగ్రెస్ సర్కార్ కు నిరుద్యో గులు ఎందుకు ఓటేయ్యాలి

ఎమ్మెల్సీ  ఎన్నిక రాష్ట్ర రాజకీయాల్లో మలుపు కాబోతుంది

నిజామాబాద్, బతుకమ్మ : కాంగ్రెస్ సర్కార్ నిర్వహించిన కులగణన పై రాజ్యసభ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జిల్లా కేంద్రంలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లడారు. ముస్లింల కోసమే కులగణన చేశారని ఆరోపించారు. కులాల మధ్య చిచ్చు పెడుతు కుల రాజకీయాలు చేస్తున్నారన్నారు. బీసీల జాబితాలోకి ముస్లింలను చేర్చి వారి పొట్టగొడుతున్నారని విమర్శించారు. బీసీల హక్కులను హరింపజేయడం రాహుల్ గాంధీ రోల్ మోడల్ లా అని ప్రశ్నించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలకు అభ్యర్థులు కరువ య్యారన్నారు. బీ ఆర్ ఎస్ పార్టీకి రాష్ర్టంలో రాజకీయంగా నూకలు చెల్లాయన్నారు. దేశమంతా బీజేపీ గాలి వీస్తోందని, ఎమ్మెల్సీ  ఎన్నిక రాష్ట్ర రాజకీయాల్లో మలుపు కాబోతోందన్నారు. ఉద్యోగాలు ఇవ్వని కాంగ్రెస్ సర్కార్ కు నిరుద్యో గులు ఎందుకు ఓట్లెయాలన్నారు.  టీచర్లకు డీఏ లు, పీఆర్సీ లు ఇవ్వకుండా ఓట్లు ఎలా అడుగుతారని నిలదీశారు. కుల గణన పై చిత్త శుద్ధి  లేకనే రేవంత్ రీ సర్వే చేపడతున్నారన్నారు. ఏడాది గడిచిన రూ.8000 కోట్ల  ఫీజు రీయింబర్స్ బకాయిలు చెల్లించకుండా ఎందుకు జాప్యం చేస్తున్నారన్నారు. నిరుద్యోగ యువతను కేసీ ఆర్ మోసం చేశాడన్నారు. రేవంత్ రెడ్డి టైం పాస్ పాలన చేస్తున్నారని విమర్శించారు. కార్య క్రమంలో ఎంపీ ధర్మపురి అర్వింద్, అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా, బీజేపీ జిల్లా అధ్యక్షు డు దినేశ్, ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి, పట్టభద్రుల బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి, టీ చర్ బీజేపీ అభ్యర్థి మల్క కొమురయ్య , కార్యకర్తలు పాల్గొన్నారు.

More articles

Latest article