హైదరాబాద్, బతుకమ్మ : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదైంది. మంగళవారం జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా పోలీసులు చెప్పినా వినకుండా యూసుఫ్ గూడ వద్ద ఓ ఫంక్షన్ హాల్ లోకి అనుచరులతో దూసుకెళ్లారని ఫిర్యాదు అందింది. ఉద్రికత్తలను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారంటూ కౌశిక్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
