23.4 C
Hyderabad

9ఏళ్ల క్రితం చనిపోయిన వ్యక్తిపై కేసు..

Must read

📰 Generate e-Paper Clip

  • ఏజే మిల్స్ పోలీస్ స్టేషన్  సీఐ సస్పెండ్

 

వరంగల్, బతుకమ్మ : 9ఏళ్ల క్రితం చనిపోయిన వ్యక్తిపై భూ కబ్జా కేసు నమోదు చేసిన ఘటనలో ఏజే మిల్స్ పోలీస్ స్టేషన్ ఇన్స్ పెక్టర్ జె.వెంకటరత్నంను సస్పెండ్ చేస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ ప్రీత్ సింగ్ ఉత్తర్వుల జారీ చేశారు. ఓ భూ వివాదం కేసులో బాధితుకుల న్యాయం చేయకుండా తప్పుడు కేసును నమోదు చేయడమే కాకుండా ఈ కేసులో 9ఏళ్ల క్రితం మరణించిన వ్యక్తి పేరును కూడా నమోదు చేసి నిందితులకు సహకరించారు. అలాగే మరో కేసులో మహిళా నిందితురాలిని పోలీస్ స్టేషన్ ఆవరణలో లైంగిక వేధింపులకు గురిచేసినట్టుగా విచారణలో నిర్ధారణ కావడంతో సస్పెండ్ చేస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు.

More articles

Latest article