బతుకమ్మ, మాచారెడ్డి: పాల్వంచ మండలానికి చెందిన ఐదుగురు పేకాట రాయుళ్ల పై కేసు నమోదు చేసినట్లు మాచారెడ్డి ఎస్ఐ అనిల్ తెలిపారు. పాల్వంచ మండల కేంద్రంలో ని పోచమ్మ ఆలయం వద్ద గల పేకాట స్థావరం పై పోలీసులు దాడి చేశారు. వారి వద్ద నుండి 3338/- రూపాయలు, 4 సెల్ ఫోన్ లు, 2 బైకులు స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. మాచారెడ్డి ఉమ్మడి మండల ప్రజలు ఎవరైనా పేకాట ఆడితే కఠిన చర్యలకు గురవుతారన్నారు. ఎవరైనా పేకాట ఆడినా , ఇసుక అక్రమ రవాణా జరుగుతున్నా, చట్ట విరుద్ధమైన పనులకు పాల్పడినా 100 కు డయల్ చేసి సమాచారమివ్వాలని ఆయన కోరారు.
