- అన్యాక్రాంతం అవుతుందని ఆందోళన
బతుకమ్మ, మాచారెడ్డి: మాచారెడ్డి ఊర చెరువు విస్తీర్ణం వివరాలు తెలుపాలని కోరుతూ ఆర్ టి ఐ చట్టం కింద దరఖాస్తు చేసుకున్నారు. అందులో శిఖం భూమి ఎంత? శిఖం భూమి ఎన్ని ఎకరాల్లో ఏక్ ఫసల్ పట్టాలు ఎంత మంది రైతులకిచ్చారు. సమాచార హక్కు చట్టం కింద వివరాల సేకరణ కు మండలం లోని గజ్యానాయక్ తండా మాజీ వార్డు సభ్యుడు, కామారెడ్డి ఏఎంసీ మాజీ డైరెక్టర్ అజీజ్ తహశీల్దార్ కు దరఖాస్తు చేసుకున్నారు. చెరువు (శిఖం) బఫర్ జోన్ లో నిర్మాణాలు జరిగినట్లు అధికారులు ప్రాథమిక విచారణలో తేలింది. దీంతో స్థానికులు పూర్తి సమాచారం కోసం అధికారులను ఆశ్రయించారు.
