. . . మామిడి కి రసాయినాలతో రంగు మార్చి అమ్మకాలు
. . . సీజన్ లో లాభాలకు వ్యాపారుల ఎత్తుగడ
. . . త్వరగా పక్వానికి వచ్చిన పండ్లను తింటే కోత్త ఆరోగ్య సమస్యలు
. . . కన్నేత్తి చూడని పుడ్ సేప్టీ అధికారులు
నిజామాబాద్, బతుకమ్మ:
నిజామాబాద్ జిల్లాలో మామిడి పండ్లను చూస్తే వణికిపోతున్నారు జనాలు. ఒక్కటి రెండు రోజుల ముందు వరకు కనిపించని మామిడి పండ్లు ఇప్పుడు రోడ్ల వేంట విచ్చల విడిగా విక్రయానికి రావడమే కారణం. అందునా మామిడి పండ్లు కిలో రూ.70 నుంచి 100 రూపాయలు పలుకుతున్నాయి. గంటల వ్యవధిలో చెట్ల మీద ఆకుపచ్చ రంగులలో ఉన్న మామిడి కాయాలను సహజ సిద్ధంగా పండ్లుగా కాక ముందే కోసీ కృత్రిమ రసాయనాలతో పక్వానికి తెస్తుండటంతో బంగారు వర్ణం (పసుపు) రంగులోకి మారి నిగనిగలాడుతున్నాయి. మామిడి కాయలు పండ్లుగా మారాయంటే తెలుసుకోవడం సులువు. అవి ప్రకృతి పరంగా పక్వానికి వస్తే దాని రంగు, రుచి, సువాసనే వేరుగా ఉంటుంది. అలాంటి మామిడి పండ్లు పక్వానికి రాకముందే రసాయనాలతో పండ్లుగా మార్చి విక్రయిస్తున్నారు.

ఈ విషయం తెలియక కొనుగోలు చేసిన ప్రజలు వేసవి సీజన్ లో కొత్త రోగాలను కొని తెచ్చుకుంటున్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో పండ్ల మార్కేట్ (ప్రూట్ మార్కేట్) ను పచ్చి మామిడి పోటేత్తింది. పూర్వపు కరీం నగర్ జిల్లా నుంచి (జగిత్యాల, కోరుట్ల, మెట్ పల్లి, సిరిసిల్లా) పెద్ద ఎత్తున మామిడి కాయలు తరలివస్తున్నాయి. మామిడి కాయల సైజులు పావు కిలో నుంచి కిలో కాగానే రైతులు వాటిని కోసి విక్రయిస్తున్నారు. రైతులు సైతం సీజన్ లో ఎండల తో పాటు ఎక్కడ గాలి వానలు (చెడగోట్టు వానలు) పడితే కాయరాలి కిందపడితే పగిలి ధర రాదని తలంచి ముందుగానే కోసేస్తున్నారు. అంతే గాకుండా వ్యాపారులతో ముందస్తు ఒప్పందం ఉన్నవారు వాటిని ఖాతా దశలోనే తెంచేలా ఒత్తిడి తేవడం, కాయల బరువు కారణంగాను ముందుగానే కాయలుగా కోసి మార్కేట్ కు తరలిస్తున్నారు…..పచ్చి మామిడి కాయలను కిలోల కొద్ది కొని మార్కేట్ కు టన్నుల కొద్ది తరలిస్తున్నారు హోల్ సెల్ వ్యాపారులు. ప్రూట్ మార్కేట్ లో ఇప్పుడు పక్వానికి తెప్పించే ప్రక్రియ గోదాంలలో రసాయిన ప్రక్రియ జోరుగా సాగుతుంది. మామిడి కాయలను పండ్లు చేసే ప్రక్రియ నిత్యం జరుగుతుంది.

కాయలకు వచ్చిన ధర కంటే పండిన మామిడికి వస్తుంది. దానితో వ్యాపారులు సహజసిద్ధమైన పండ్ల కంటే కృత్రిమ రసాయనాలను కలిపి మామిడి కాయలను గంటల వ్యవథిలో పక్వానికి వచ్చేలా కార్బైడ్ రసాయినాలతో నింపి పండ్లుగా మార్చి విక్రయించే దందా జరుగుతుంది. మరో పక్షం రోజులు గడిస్తే గాని చెట్ల మీద పండు అయ్యే కాలం కాదు. దానితో రైతులు కాయలను అమ్ముకోని బరువు దించుకుంటుండగా వ్యాపారులు వాటిని పండ్లుగా మార్చి సొమ్ము చేసుకుంటున్నారు. ప్రస్తుతానికి తెలంగాణ నుంచి మాత్రమే మామిడి కాయల దిగుమతి సాగుతుంది. మరి కొన్ని రోజులు గడిస్తే ఆంద్ర నుంచి లేదా పొరుగున ఉన్న మహారాష్ట్ర నుంచి మామిడి కాయలను దిగుమతి చేసుకుని పండ్లుగా పక్వానికి వచ్చేలా చేసి విక్రయించే దందా ఏళ్ల తరబడి జరుగుతుంది.

నిజామాబాద్ మున్సిపల్ ఆరోగ్య విబాగం అసలే ఎంహెఓ (కార్పోరేషన్ మెడికల్ ఆఫీసర్) లేక ఆ పోస్టు నిర్విర్యమైంది. అక్కడ పని చేయాల్సిన డాక్టర్ లేడని సాధారణ మున్సిపల్ జవాన్ క్యాడర్ అధికారితో దానిని నెట్టుకోస్తున్నారు. దానితో ప్రజా ఆరోగ్య విభాగం పడకేసింది. జిల్లా ఫుడ్ సేప్టి అధికారులు ప్రతి సీజన్ లో జరిగే కృత్రిమ మామిడికాయలను పండ్లుగా చేసే ప్రక్రియ జరుగుతున్న పట్టించుకోవడం లేదు. జిల్లాల పునర్విభజన తరువాత క్యాడర్ స్ట్రేంత్ లేదని ఇంచార్జీల పాలనలో పట్టించుకునేవారు కరువయ్యారు. ఫుడ్ సేప్టీ ఆఫీసర్ ఒక్కరే జిల్లాల ను మొత్తం తనిఖీలు చేయాల్సి రావడంతో పరిస్థితి దారుణంగా తయారైంది. ప్రజల ఆరోగ్యాలను పణంగా పెట్టి జరుగుతున్న రసాయిన ప్రక్రియకు చెక్ పెట్టే వారు కరువయ్యారు.

