24 C
Hyderabad
Sunday, August 2, 2026

కారు దగ్ధం.. డ్రైవర్ సజీవ దహనం

Must read

📰 Generate e-Paper Clip

హైదరాబాద్, బతుకమ్మ :   కారు దగ్ధమై డ్రైవర్ సజీవ దహనమైన ఘటన మేడ్చల్ జిల్లాలో సోమవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. ఔటర్ రింగ్ రోడ్డుపై శామీర్ పేట నుంచి కీసర వెళ్తున్న ఓ కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. మంటల ధాటికి కారు డోర్లు ఆటోమెటిక్ గా లాక్ అవ్వడంతో డ్రైవర్ కారు నుంచి బయటకు రాలేక ప్రాణాలు కోల్పోయాడు.  స్థానికుల సమాచారం మేరకు ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మంటలను ఆర్పేశారు.  మృతదేహాన్ని బయటకు తీసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. మృతుడు ఎవరనే విషయం తెలియాల్సి ఉంది.

More articles

Latest article