28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

కామ్రేడ్ జేసిఎస్ ప్రసాద్ కు కొవ్వొత్తులతో నివాళి 

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : 

ఉద్యమ నిర్మాత జంపాల చంద్రశేఖర్ ప్రసాద్ వర్ధంతి సందర్భంగా ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో జంపాల చంద్రశేఖర్ ప్రసాద్ కు ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో నివాళులర్పించారు. ఈ సందర్భంగా పిడి ఎస్ యు జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ కర్క గణేష్ మాట్లాడుతూ కామ్రేడ్ జార్జి రెడ్డి వారసత్వాన్ని అందిపుచ్చుకొని మతోన్మాదులకు వ్యతిరేకంగా, సమసమాజ స్థాపనకై, విద్యా రంగ సమస్యల పరిష్కారానికి రాష్ట్రవ్యాప్తంగా జంపాల చంద్రశేఖర్ ప్రసాద్ విద్యార్థి ఉద్యమాన్ని విస్తృతం చేశారన్నారు. కామ్రేడ్ జంపాల చంద్రశేఖర్ ప్రసాద్ నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం గ్రామానికి చెందిన వారన్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో ఇంజనీరింగ్ విద్యను అభ్యసిస్తున్న సమయంలో పి డి ఎస్ యు నిర్మాణాన్ని రాష్ట్రమంతా చేశారన్నారు. ఎమర్జెన్సీ కాలంలో నీలం రామచంద్రయ్య తోపాటు జంపాల చంద్రశేఖర్ ప్రసాద్ ను ఎన్ కౌంటర్ పేరుతో పోలీసులు కాల్చి చంపారన్నారు. అయితే జార్జి రెడ్డి, జంపాల చంద్రశేఖర్ ప్రసాదుల త్యాగాల వెలుగులో పి.డి.ఎస్.యు రాష్ట్రంలోనే బలమైన విప్లవ విద్యార్థి సంఘంగా ఎదిగిందన్నారు. పాలకవర్గాల అవలంబిస్తున్న విద్యా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాడాలని, అదే కామ్రేడ్ జేసిఎస్ ప్రసాద్ కు నిజమైన నివాళి అని అన్నారు.

More articles

Latest article