కామ్రేడ్ జేసిఎస్ ప్రసాద్ కు కొవ్వొత్తులతో నివాళి
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ఉద్యమ నిర్మాత జంపాల చంద్రశేఖర్ ప్రసాద్ వర్ధంతి సందర్భంగా ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో జంపాల చంద్రశేఖర్ ప్రసాద్ కు ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో నివాళులర్పించారు. ఈ సందర్భంగా పిడి ఎస్ యు జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ కర్క గణేష్ మాట్లాడుతూ కామ్రేడ్ జార్జి రెడ్డి వారసత్వాన్ని అందిపుచ్చుకొని మతోన్మాదులకు వ్యతిరేకంగా, సమసమాజ స్థాపనకై, విద్యా రంగ సమస్యల పరిష్కారానికి రాష్ట్రవ్యాప్తంగా జంపాల చంద్రశేఖర్ ప్రసాద్ విద్యార్థి ఉద్యమాన్ని విస్తృతం చేశారన్నారు. కామ్రేడ్...