27.3 C
Hyderabad
Friday, July 31, 2026

శాంతించిన వరుణుడు

Must read

📰 Generate e-Paper Clip

  • ప్రకృతి బీభత్సం నుంచి కోలుకుంటున్న ప్రజలు
  • ధ్వంసమైన రోడ్లు
  • ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో యంత్రాంగం
  • కొనసాగుతున్న ముంపు బాధితుల సహాయ శిబిరాలు

 

నిజామాబాద్/ కామారెడ్డి, బతుకమ్మ : కుంభవ`ష్టి ప్రభావానికి లోనైన ఉమ్మడి జిల్లా తేరుకుంటుంది. మంగళవారం ప్రారంభమైన వర్షం శుక్రవారం శాంతించింది. కామారెడ్డి జిల్లాను అతలాకుతలం చేసిన క్లౌడ్ బరస్ట్ నుంచి ప్రజలు కోలుకుంటున్నారు. నిజామాబాద్ జిల్లాలో సిరికొండ, భీంగల్, ఇందల్వాయి, ధర్పల్లి, చందూర్, సాలురా మండలాల్లోని ప్రజలు ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నారు. నిజాంసాగర్, శ్రీరాంసాగర్ ప్రాజెక్టులకు వరద కొనసాగుతునే ఉంది. మంజిరా, గోదావరి నదులు ఇంకా శాంతించనే లేదు. నిజాంసాగర్ ప్రాజెక్టు నుంచి విడుదలవుతున్న లక్షల క్యూసెక్కుల నీరుకు పిట్లం, నిజాంసాగర్, బాన్సువాడ, కోటగిరి, పోతంగల్, సాలురా మండలాల్లోని పలు పరివాహక ప్రాంతాలు ఇంకా ముంపు ముంగిటనే ఉన్నాయి. వేలాది ఎకరాల పంటలు నీటమునిగాయి. విద్యుత్ పునరుద్దరణ పనులు కొనసాగుతున్నాయి. రహదారుల మరమ్మత్తులను చేపట్టారు.

Calmed down Varuna

కామారెడ్డి జిల్లాలో మద్నూర్ లో 14, గాంధారి, బాన్సువాడలో 12, తాడ్వాయి 11, రామారెడ్డి 17, నస్రుల్లాబాద్ 15, నిజాంసాగర్, కామారెడ్డిలో 10 సెం.మీ. వర్షం కురిసింది. అయితే శుక్రవారం వర్షం తగ్గడంతో ప్రజలు కోలుకుంటున్నారు. ప్రధానంగా కామారెడ్డి పట్టణంలోని జీఆర్ కాలనీ, హౌజింగ్ బోర్డు కాలనీ, కౌండిన్యకాలనీ, సారంపల్లి రోడ్డు ప్రాంతంలో పూర్వస్థితిలోకి తీసుకువచ్చేందుకు యంత్రాంగం పనులు చేపట్టింది. 44వ జాతీయ రహదారి మరమ్మత్తులు కొనసాగుతునే ఉన్నాయి. బోధన్, ఎల్లారెడ్డి ప్రధాన రహదారి రిపేర్ పనులను చేస్తున్నారు. రైళ్ళ పునరుద్దరణ జరుగకపోవడంతో దారి మళ్ళింపు కొనసాగుతుంది. పోచారం ప్రాజెక్టు మట్టికట్ట కొట్టుకపోవడంతో మరమ్మత్తు పనులను యుద్దప్రాతిపదికన చేపట్టారు. కామారెడ్డి జిల్లాలో వర్షాభావ పరిస్థితులను జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ పర్యవేక్షించారు. భారీ వర్షాలకు తెగిపోయిన రోడ్ల మరమ్మత్తులు చేపట్టేందుకు అధికారులు ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు. నీట మునిగిన వేలాది ఎకరాల పంట నష్టాన్ని అంచనా వేసే పనిలో పడ్డారు అధికారులు.

Calmed down Varuna

నిజామాబాద్ జిల్లాలో గురువారం నుంచి శుక్రవారం వరకు సిరికొండ, తూంపల్లిలో 23, బోధన్, కల్దుర్కిలో 16, సిరికొండలో 16, ధర్పల్లిలో 15, సిరికొండ, చీమన్ పల్లిలో 13, మాక్లూర్, మధన్ పల్లిలో 12, భీంగల్ లో 12, డిచ్ పల్లిలో 11, బోధన్ చిన్నమావందిలో 11, డిచ్ పల్లి, కొరట్ పల్లి, కమ్మర్ పల్లి, కొనసముందర్ లలో 11 సెం.మీ. వర్షపాతం కురిసింది. నిజామాబాద్ జిల్లాలో అత్యల్పంగా మోపాల్ మండలం మంచిప్పలో 10 సెం.మీ వర్షపాతం కురిసింది.  శుక్రవారం మధ్యాహ్నం వర్షం తగ్గుముఖం పట్టడంతో ప్రజలు ఊపీరిపీల్చుకున్నారు. రెండు రోజులుగా నిజామాబాద్ జిల్లాలో 21 మండలాల్లో 145 గ్రామాల్లో పంట నష్టం సంభవించినట్లు అధికారులు లెక్కలు తేల్చారు. 28,131 ఎకరాల్లో 14603 మంది రైతులకు సంబంధించిన వరి, 81 ఎకరాలలో 47 మంది రైతులకు సంబంధించిన పత్తి పంట, 560 ఎకరాల్లో 382 ఎకరాలకు సంబంధించిన మొక్కజొన్న, 5 ఎకరాల్లో శనగ, 12054 ఎకరాల్లో 5418 మంది రైతుల సోయాబిన్, 252 ఎకరాల్లో 139 రైతులకు సంబంధించిన కూరగాయల పంటలు, ఇతర 16 ఎకరాల్లో ఆరుగురు రైతులకు సంబంధించిన పంటలు నష్టపోయినట్లు వ్యవసాయ శాఖ లెక్కలు తేల్చింది. 41098 ఎకరాల్లో 20660 మంది రైతుల పంటలు నీట మునిగి నష్టపోయినట్లు అధికారులు గుర్తించారు. 11 మండలాల్లో 1021 ఎకరాల్లో పంటలు ఇసుక మేటలు వేసినట్లు అధికారులు తెలిపారు. నిజామాబాద్ జిల్లా కలెక్టర్ వినయ్ క`ష్ణారెడ్డి బోధన్, సాలురా మండలాల్లో పర్యటించారు. బ్యాక్ వాటర్ కారణంగా జలదిగ్భంధంలో ఉన్న కొప్పర్గ, సాలురా, ఖాజాపూర్ గ్రామాలను సందర్శించారు.

Calmed down Varuna

More articles

Latest article