శాంతించిన వరుణుడు

ప్రకృతి బీభత్సం నుంచి కోలుకుంటున్న ప్రజలు ధ్వంసమైన రోడ్లు ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో యంత్రాంగం కొనసాగుతున్న ముంపు బాధితుల సహాయ శిబిరాలు   నిజామాబాద్/ కామారెడ్డి, బతుకమ్మ : కుంభవ`ష్టి ప్రభావానికి లోనైన ఉమ్మడి జిల్లా తేరుకుంటుంది. మంగళవారం ప్రారంభమైన వర్షం శుక్రవారం శాంతించింది. కామారెడ్డి జిల్లాను అతలాకుతలం చేసిన క్లౌడ్ బరస్ట్ నుంచి ప్రజలు కోలుకుంటున్నారు. నిజామాబాద్ జిల్లాలో సిరికొండ, భీంగల్, ఇందల్వాయి, ధర్పల్లి, చందూర్, సాలురా మండలాల్లోని ప్రజలు ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నారు. నిజాంసాగర్, శ్రీరాంసాగర్ ప్రాజెక్టులకు వరద కొనసాగుతునే ఉంది. మంజిరా, గోదావరి...