తెలంగాణ వైద్య ఆరోగ్య ఉద్యోగుల సంఘం క్యాలెండర్ ఆవిష్కరణ
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : తెలంగాణ వైద్య ఆరోగ్య ఉద్యోగుల సంఘం నూతన సంవత్సర క్యాలెండర్ ను సోమవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని డాక్టర్ బి. రాజశ్రీ చేతుల మీదుగా డిఎం అండ్ హెచ్ ఓ కార్యాలయంలో ఆవిష్కరించినట్లు యూనియన్ జిల్లా అధ్యక్షులు ఘనపూర్ వెంకటేశ్వర్లు తెలియజేశారు. ఈ సందర్భంగా డిఎంహెచ్ఓ మాట్లాడుతూ ఉద్యోగులందరూ అంకితభావంతో పని చేయాలని సూచించారు. అన్ని జాతీయ ఆరోగ్య కార్యక్రమాలు, ప్రజారోగ్య సంక్షేమ కార్యక్రమాలన్ని ప్రజల్లోకి తీసుకెళ్లినప్పుడే ప్రజలకు ఆరోగ్యం అందుబాటులో ఉండి ఆరోగ్యవంతమైన సమాజం ఏర్పడుతుందని...