భీమ్ గల్, బతుకమ్మ : మండలంలోని రహత్ నగర్ గ్రామంలో మండల బీజేపీ శాఖ ఆధ్వర్యంలో రచ్చ బండ కార్యక్రమం ను నిర్వహించారు. బిజెపి జిల్లా అధ్యక్షులు దినేష్ కులచారి సూచన, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ ఏలేటి మల్లికార్జున్ రెడ్డి ఆదేశానుసారం శుక్రవారం ఈ రచ్చబండ కార్యక్రమాన్ని మండల అధ్యక్షులు ఆరే రవీందర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర సర్కార్ చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు.గిరిజనుల సమస్యలను తెలుసుకొని వారి సమస్యలను ఎంపీ గారి దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇస్తూ రానున్న స్థానిక సంస్థల్లో పోటీ చేసి విజయం సాధించేందుకు మార్గనిర్దేశం చేసారు. నియోజకవర్గ బిజెపి ఇన్చార్జ్ మల్లికార్జున్ రెడ్డి ఆదేశం మేరకు ఎస్టీ మోర్చా మండల అధ్యక్షులుగా లింబాద్రి నాయక్ ను, ఉపాధ్యక్షులుగా రామావత్ వెంకటేష్ నాయక్ లను నియమిస్తూ వారికి నియామక పత్రాలను అందజేశారు, రానున్న రోజులలో గిరిజన గ్రామాలలో బిజెపి పార్టీని బలోపేతం చేసేందుకు ఈ కమిటీ పూర్తిస్థాయిలో కష్టపడి పని చేయాల్సిందిగా వారికి సూచనలు చేశారు.ఈనెల చివరన నిజామాబాద్ పట్టణంలో హోం మంత్రి అమిత్ షా పర్యటన కార్యక్రమం ఉంటుందని, అట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బిజెపి కార్యకర్తలను,నాయకులకు కోరారు.ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ యోగేశ్వర నరసయ్య,సీనియర్ నాయకులు సంధ్య రాజు, కిసాన్ మోర్చా అధ్యక్షులు తోట గంగాధర్,మండల ఉపాధ్యక్షులు భూక్య మోహన్,ఈర్ల మహేందర్, ప్రధాన కార్యదర్శి రామకృష్ణ, నాయకులు గణపతి, ధోని నాయక్,సంతోష్, లింబాద్రి,నవతేజ్, దేవేందర్ భూత్ అధ్యక్షులు,శక్తి కేంద్ర ఇన్చార్జిలు మరియు గిరిజన నాయకులు పాల్గొన్నారు.
