కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం

0 1,152

నిజామాబాద్, బతుకమ్మ : కేంద్ర ప్రభుత్వం రైతాంగం పట్ల అనుసరిస్తున్న విధానాలకు నిరసనగా బుధవారం ఏఐకేఎంఎస్ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఎంఎస్పి మద్దతు ధరల గ్యారెంటీ చట్టాన్ని తీసుకురావాలని, విద్యుత్ సవరణ బిల్లు రద్దు చేయాలని, నూతన వ్యవసాయ విధానాలను విరమించుకోవాలని, రైతు ఉద్యమానికి మోడీ ప్రభుత్వం లిఖితపూర్వకంగా ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని గత 45 రోజులుగా స్వయాన రైతు నాయకులు ఎస్కేఎంఎస్ జాతీయ నాయకులు జగదీష్ సింగ్ దల్లేవాల ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారని. వీరి ఆరోగ్యం రోజురోజుకు క్షీణిస్తుందని ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షులు వేల్పురు భూమయ్య అన్నారు. వీరికి ఏమాత్రం ముప్పు జరిగినా అది కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాల్సి వస్తుందని అన్నారు. దల్లేవాల నిరాహార దీక్షకు మద్దతుగా, మోడీ ప్రభుత్వానికి నిరసనగా బుధవారం అఖిలభారత రైతు కూలీ సంఘం ఏఐకేఎంఎస్ జాతీయ కమిటీ పిలుపులో భాగంగా జిల్లా కేంద్రంలోని ధర్నా చౌక్ లో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతాంగ వ్యతిరేక మూడు వ్యవసాయ  చట్టాల రద్దు కోసం, పంటల గిట్టుబాటుకై కనీస మద్దతు ధర కోసం ఏడాదికి పైగా రైతులు దేశ రాజధాని ఢిల్లీ చుట్టూ సింగు,  డిగ్రీ, ఘాజాపూర్ ధర్నా కార్యక్రమాలు నిర్వహించారని తెలిపారు. రైతుల డిమాండ్ల నెరవేరుస్తామని మోడీ ప్రభుత్వం హామీ ఇచ్చిందని అన్నారు. దీర్ఘకాలిక ఆందోళనను విరమింపజేసింది, కానీ ఆ హామీలను నేడు పట్టించుకోవడం లేదని అన్నారు. ఎస్కేయం నాయకత్వంలో రైతాంగం మళ్లీ ఉద్యమిస్తుందని తెలిపారు. అందులో భాగంగా రైతాంగ నాయకుడు జగత్ సింగు దలియవాల్ ఆమరణ నిరాహార దీక్షకు పూనుకున్నాడని  తెలిపారు. వారికి మా అఖిల భారత రైతు కూలీ సంఘం నిజామాబాద్ జిల్లా కమిటీ తన సంఘీభావాన్ని ప్రకటిస్తుందని తెలిపారు. కనీస మద్దతు ధర చట్టాన్ని ఇకనైనా రూపొందించాలని డిమాండ్ చేశారు. రైతాంగానికి  ఇచ్చిన హామీలను నెరవేర్చాలని లేకపోతే ఉధృతమయ్యే ఆందోళనలో తాము కూడా భాగస్వామ్యం అవుతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

Leave A Reply

Your email address will not be published.