27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

తాళం వేసిన ఇంట్లో చోరీ

Must read

📰 Generate e-Paper Clip

బోధన్, బతుకమ్మ  : బోధన్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సాలంపాడు గ్రామంలో తాళం వేసిన ఇంట్లో దొంగతనం జరిగినట్లు ఎస్ఐ మచ్చేందర్ తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం బోధన్ మండలంలోని సాలంపాడు గ్రామానికి చెందిన ఎడపల్లి నర్సారెడ్డి, అతని భార్య ఈనెల 21న హైదరాబాద్‌కు బంధువుల పెళ్లికి వెళ్లారు. 26వ తేదీ సాయంత్రం ఐదు గంటలకు ఇంటికి తిరిగి వచ్చారు. ఇంటి తాళం, బీరువా పగలగొట్టి దొంగలు 2 తులాల బంగారం, 4 తులాల వెండి, 25 వేల నగదు అపహరించారని గుర్తించారు. బాధితుడు బోధన్ రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

More articles

Latest article