మద్నూర్, బతుకమ్మ: బహుజన సమాజ్ పార్టీ జుక్కల్ నియోజకవర్గ అధ్యక్షుడు ఇబ్బత్వార్ రోహిదాస్ అధ్వర్యంలో పిట్ల మండల కేంద్రంలో బుధవారం జుక్కల్ బీఎస్పి నూతన కమిటీ ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కామారెడ్డి జిల్లా అధ్యక్షులు మాలోత్ హరిలాల్ నాయక్ హాజరై మాట్లాడుతూ.. జుక్కల్ లో బీఎస్పి జండా ఏగర వేసే దిశలో పార్టీని బలోపేతం చేయాలని కోరారు. జుక్కల్ నియోజకవర్గం ఉపాధ్యక్షుడిగా ఆర్ బాబు, ప్రధాన కార్యదర్శి కే రాములు,సేరే అశోక్, కోశాధికారిగా సర్డే రాజు లకు నియమించారు. నూతన కమిటీ సభ్యులను శుభాకాంక్షలు తెలిపి బాధ్యతలు అప్పగించారు. నూతన కమిటీ సభ్యులు తనపై నమ్మకం పెట్టుకొని నియమించిన కమిటీ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బాలరాజు,ప్రవీణ్, బలరాం పార్టీ కార్యకర్తలు తదితరులు హాజరయ్యారు.
