27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

రౌడీ షీటర్ దారుణ హత్య

Must read

📰 Generate e-Paper Clip

హైదరాబాద్, బతుకమ్మ: కోర్టుకు వచ్చి తిరిగి వెళ్తున్న ఓ రౌడీ షీటర్ ను ఐదుగురు దుండగులు కలిసి దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన హైదరాబాద్ లోని నాంపల్లిలో గురువారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. చాంద్రాయణ గుట్టకు చెందిన రౌడీషీటర్ అయాన్ ఖురేషీ ఓ కేసులో కోర్టుకు హాజరై తిరిగి వెళ్తుండగా ఐదుగురు దుండగులు ఆయనను వెంబడించారు. క్యాన్సర్ దవాఖాన వద్ద దాడి చేసి కత్తులతో గొంతు కోసి హతమార్చారు. హత్యకు ఉపయోగించిన కత్తులను ఘటనాస్థలంలోనే వదిలేసి వెళ్లారు. ఈ ఘటన కలకలం సృష్టించింది.

More articles

Latest article