26.2 C
Hyderabad
Monday, August 3, 2026

జోర్డాన్ బాధిత కుటుంబానికి బిఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ,ఏర్గట్ల: మండల కేంద్రానికి చెందిన అల్గోట్ గంగాధర్ బ్రతుకుతెరువు కోసం గల్ఫ్ దేశం వెళ్లాలన్న ఆలోచనతో నిర్మల్ జిల్లాకు చెందిన గల్ఫ్ ఏజెంట్ ద్వారా జోర్డాన్ వెళ్లడం జరిగింది. కానీ విధి వక్రీకరించి అతనికి చెప్పిన పని ఒకటి అయింది అని,అలాగే దేశం కానరాని ప్రాంతంలో తోటలో పని దానికి తోడు భోజన సౌకర్యం కూడా లేకుండా అతనితో పాటుగా ఇంకొంతమంది నరకయాతన అనుభవించడం జరిగింది. ఇట్టి విషయాన్ని  సోషల్ మీడియా ద్వారా వారికి జరిగిన కష్టాలను మీడియా రూపంలో బయటకు పంపడం జరిగింది. దీన్ని గమనించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు వారి గురించి సీరియస్ గా  తీసుకొని వారు స్వస్థలానికి రావడానికి పూర్తి సహాయ సహకారాలు అందించి ఇటీవలనే వారిని స్వస్థలాలకు రప్పించడం జరిగింది. ఇట్టి విషయంపై బాల్కొండ ఎమ్మెల్యే మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఏర్గట్ల మండల కేంద్రంలో గల్ఫ్ బాధిత కుటుంబాన్ని పరామర్శించి వారి బాధలు తెలుసుకొని వారి కుటుంబానికి అండగా ఉంటామని ఏర్గట్ల మండలానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ నాయకులు కలిసి భరోసా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రాజా పూర్ణానందం, మాజీ ఎంపీపీ ఉపేందర్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ మధుసూదన్,బద్దం శ్రీనివాస్ రెడ్డి,బిఆర్ఎస్ పార్టీ నాయకులు నరేందర్ రెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షులు దేవుడు నరసయ్య, లక్కం నరసయ్య, గుండ్లగంగాధర్, బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలుపాల్గొన్నారు.

More articles

Latest article